News
టోల్ గేట్ ఫీ రద్దు
కేంద్ర ప్రభుత్వం 500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో టోల్ గేట్ల దగ్గర భారీగా ట్రాఫిక్ జాం అవుతోంది. వాహనదారులు, టోల్ గేట్ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు టోల్ టాక్స రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు కేంద్ర రవాణమంత్రి నితిన్ గడ్కరీ. గురువారం అర్ధరాత్రి వరకు ఎక్కడ కూడా టాక్స్ వసూలు చేయవద్దని ఆదేశాలిచ్చారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ అకౌంటులో ప్రకటించారు. ఇదివరకు పెట్రోల్ బంకుల్లో 500, వెయ్యి రూపాయల నోట్లు తీసుకోకుంటే నిర్వాహకులపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. నోట్లను యాక్సెప్ట్ చేయకపోతే లైసెన్స్ లు రద్దు చేసేందుకు కూడా వెనకాడబోమని తేల్చి చెప్పారు. అటు దేశవ్యాప్తంగా ఉన్న టోల్ గేట్ సెంటర్ల దగ్గర రూ. 500, వెయ్యి రూపాయల నోట్లు చెల్లవంటూ కరెన్సీని తీసుకోవడానికి నిరాకరించారు టోల్ గేట్ నిర్వాహకులు. పెద్ద నోట్లు ఏవీ తీసుకోవడం లేదు. టిక్కెట్ కోసం ఐదు వందలు నోట్లు ఇవ్వడంతో టోల్ గేట్ సిబ్బంది చిల్లర ఇవ్వడంలేదు. అలాగని వాహనాన్ని వదలడంలేదు. దీంతో పలు టోల్ గేట్ల వద్ద విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. అయితే తమ దగ్గర ఉన్న చిల్లరంతా ఇచ్చేసినా ఇంకా ఇవ్వవలసి వస్తోందని, దీంతో ఏం చేయాలో పాలుపోవడంలేదని టోల్ గేట్ సిబ్బంది అంటున్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








